నిజంనిప్పులాంటిది

May 02 2024, 08:40

ఈ నెల 5న తెలంగాణ లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం

తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికల రాజకీయం రస వత్తరంగా మారింది. అభ్యర్థులతో పాటు కీలక నేతల ప్రచారాలతో రాజకీయ కాక రేగుతోంది.

ప్రధాన పార్టీల నుంచి కీలక నేతలు రంగంలోకి దిగడం తో విమర్శలు, ప్రతివిమ ర్శలతో రాష్ట్రం వేడెక్కింది. ముఖ్యంగా జాతీయ పార్టీల నేతలు రాష్ట్రానికి వస్తుండ టంతో ప్రచారం మరింత ఊపందుకుంది.

ఇప్పటికే మోదీ, అమిత్ షా, నడ్డా బీజేపీ తరఫున ప్రచా రం చేశారు. ఇక కాంగ్రెస్ నుంచి కూడా జాతీయ నేతలు రంగంలోకి దిగుతున్నారు.

ఇందులో భాగంగానే లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల రాష్ట్ర పర్యటన ఖరారైనట్లు పీసీసీ వర్గాలు వెల్లడిం చాయి.

ఈనెల 5వ తేదీన రాహుల్ గాంధీ నిర్మల్, గద్వాల్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్ధు లకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారని తెలిపాయి.

ఈనెల 9వ తేదీన కరీంనగ ర్, సరూర్ నగర్, ప్రచారం చేయనున్నారు. ఈ నెల 6,7వ తేదీల్లో ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రానున్నా రు. 6వ తేదీన ఎల్లారెడ్డి, తాండూర్, సికింద్రాబాద్ ఎన్నికల ప్రచార సభలకు, 7వ తేదీన నర్సాపూర్, కూకట్పల్లిలో ప్రియాంక ప్రచారం చేయనున్నారు...

నిజంనిప్పులాంటిది

May 02 2024, 08:02

గ్రామ గ్రామాన రెపరెపలాడిన ఎర్రజెండాలు

ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లాలోని వివిధ గ్రామాలు మండలాల్లో లాల్ జెండాలు రెపరెపలాడాయి. దీనిలో భాగంగా...

శంకరపట్నం మండల కేంద్రం లో లాల్ జెండాలను కార్మికు లు కర్షకులు ఎగురవేసి పండగ వాతావరణాన్ని సృష్టించి బుధవారం మేడేను ఘనంగా నిర్వహించుకున్నారు. 

ఈ సందర్భంగా ఏఐటీయూ సీ జిల్లా కార్యదర్శిపిట్టల సమ్మయ్య.సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వెలమరెడ్డి రాజిరెడ్డి, సిఐటియు ఆటో యూనియన్ మండల అధ్యక్షుడు వంగ బిక్షప తి,హమాలి సంఘం నాయకులు బిల్డింగ్ వర్కర్స్ ల ఆధ్వర్యంలో ఎర్రజెండా లను ఎగురవేశారు. 

ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి రాజి రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య,లు మాట్లాడు తూ..దేశంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్పొరేట్ సంస్థల యజమా నులకు ఊడిగం చేస్తున్నా యని అన్నారు. 

బుధవారం ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించు కొని ఘనంగా మేడే ఉత్స వాలను శంకరపట్నం, కేశవపట్నం, మండల కేంద్రాలలోని కొత్తగట్టు, గద్దపాక, ఎరడపల్లి, మొలంగూర్, కన్నాపూ ర్ ,లింగాపూర్,తాడికల్, గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో కార్మికులు, కర్షకులు ఎర్ర జెండాలు ఎగురవేసి ఘనంగా మేడే ఉత్సవాలను పండగ వాతావరణం జరుపుకు న్నారు.

 జిల్లా,మండల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక,ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబి స్తూ,కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని,త్యాగాలు,పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించా లని నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయా లని,కార్మిక చట్టాల పునరు ద్ధరణకై దేశంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని దేశాన్ని రాజ్యాంగాన్ని ప్రజలను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు,

అమెరికా నగరం హే మార్కె ట్లో 1886 మే 1న సమ్మె చేయాలని నిర్ణయించిన ప్రపంచ కార్మికుల సమైక్య సోషలిస్టు మరియు కార్మిక సంఘాల సమ్మె హే మార్కెట్లో భారీ నిరసన ప్రదర్శన ఎనిమిది గంటల పరిధినంకై కదం తొక్కిన కార్మికులు పెట్టుబడిదా రులు,వారి గుండాలు, పోలీసులు జరిపిన తుపాకుల కాలుపులో చనిపోయిన వారి రక్తం తలసి ఎగిరిసిన ఎర్రజెండే మేడే" అని అన్నారు.

75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పౌర ప్రజా సౌమ్య పాలన అంతమైం దని పెట్టుబడిదారీ విధానం కొనసాగుతుందని కార్మిక వర్గం దిశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలు 29 చట్టాలను సమూలంగా రద్దుచేసి పెట్టుబడుదాలకు అను కూలంగా నాలుగు కోడ్ లను తెచ్చిందని, పెన్షన్ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సివిల్ సప్లై హమాలి కార్మి కులను ప్రభుత్వ ఉద్యోగు లుగా గుర్తించాలని, ఎగుమతి-దిగుమతి రేట్లు క్వింటాలకు రూ.40/-పెంచా లని,హమాలి,ఆటో,ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సమగ్ర సంక్షే మ చట్టాన్ని తేవాలని,భవన నిర్మాణ కార్మికుల మరణా నికి 10 లక్షల చెల్లించాలని ఐదు వేల పెన్షన్ ఇవ్వాల ని,సింగరేణి కాంటాక్ట్ కార్మి కులను సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు...

నిజంనిప్పులాంటిది

May 01 2024, 20:27

లోక్ సభ ఎన్నికలు 2024 హైదరాబాద్ లోక్ సభ స్థాన చరిత్ర

ఒవైసీ అలాగే ఉంటాడా లేదా హైదరాబాద్ "నిజాం" మారతాడా, ఈ సీటు రాజకీయ చరిత్ర తెలుసుకోండి

నిజాం నగరం హైదరాబాద్

ముత్యాలకు ప్రసిద్ధి

1984 నుండి AIMIM బలమైన కోట

40 ఏళ్లుగా ఒవైసీ కుటుంబం ఆధీనంలో ఉంది

మొత్తం 17 ఎన్నికల్లో ఒవైసీ కుటుంబం పదిసార్లు గెలిచింది

తండ్రి 6 సార్లు, కొడుకు 4 సార్లు ఎంపీ అయ్యారు

ఈసారి “నిజాముల కోట” బద్దలవుతుందా

దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు హైదరాబాద్‌ సీటు ప్రస్తావనకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. చారిత్రాత్మకంగా ఈ నగరం చాలా ముఖ్యమైనది మరియు రాజకీయంగా కూడా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. హైదరాబాద్‌ను నిజాంలు మరియు ముత్యాల నగరం అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన నగరాలలో ఇది ఒకటి. తెలంగాణలోని హైదరాబాద్ లోక్‌సభ స్థానం బీఆర్‌ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ లేదా బీజేపీ తప్పు చేయని స్థానం. ఇక్కడ మాత్రమే మరియు AIMIM యొక్క నాణెం మాత్రమే అంటే ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ మాత్రమే నడుస్తుంది.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి హైదరాబాద్‌లో జరిగిన మొత్తం 17 లోక్‌సభ ఎన్నికల్లో ఒవైసీ కుటుంబం పదిసార్లు విజయం సాధించింది. ఇతరులకు ఏడుసార్లు మాత్రమే అవకాశం వచ్చింది. కాంగ్రెస్ చివరి విజయం 1980లో. 1984లో అసదుద్దీన్ తండ్రి సలావుద్దీన్ ఒవైసీ తొలిసారిగా కాంగ్రెస్ విజయ పరంపరకు బ్రేక్ వేశారు. ఆ తర్వాత ఏ పార్టీ కూడా దీనిపై ఆసక్తి చూపలేదు. సలావుద్దీన్ వరుసగా ఆరు ఎన్నికల్లో గెలుపొందగా, అసదుద్దీన్ నాలుగు ఎన్నికల్లో విజయం సాధించారు.

హైదరాబాద్ లోక్ సభ స్థానం చరిత్ర

1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి తొలిసారిగా ఓటింగ్ జరిగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ మొహియుద్దీన్ విజయం సాధించారు. కానీ 1957 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తన అభ్యర్థిని మార్చింది. వినాయక్‌రావు కోరట్కర్‌ను కాంగ్రెస్‌ రంగంలోకి దించగా ఆయన విజయం సాధించారు.

1962లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన గోపాలయ్య సుబ్బుకృష్ణ మెల్కోటే విజయం సాధించారు. 1971 సాధారణ ఎన్నికల్లో మెల్కోటే ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. అయితే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బదులు తెలంగాణ ప్రజాసమితి టికెట్‌పై మెల్కోటే పోటీ చేశారు.

1977లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన కేఎస్‌ నారాయణ్‌ విజయం సాధించారు. 1980 సాధారణ ఎన్నికలలో, కెఎస్ నారాయణ్ మళ్లీ కాంగ్రెస్ (ఐ) టిక్కెట్‌పై ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఒవైసీ కుటుంబం వరుసగా గెలుస్తూ వస్తోంది.

గత 40 ఏళ్లుగా ఒవైసీ కుటుంబం వృత్తి

హైదరాబాద్ లోక్‌సభ స్థానం గత 40 ఏళ్లుగా ఒవైసీ కుటుంబం ఆధీనంలో ఉంది. ఈ కుటుంబానికి చెందిన ఒకరు 1984లో తొలిసారిగా హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. అసదుద్దీన్ ఒవైసీ తండ్రి సలావుద్దీన్ ఒవైసీ ఈ విజయం సాధించారు. అప్పటి నుంచి వరుసగా 6 సార్లు ఈ సీటును గెలుచుకున్నారు. సలావుద్దీన్ ఒవైసీ 1984, 1989, 1991, 1998 మరియు 1999 సంవత్సరాల్లో ఎంపీగా ఎన్నికయ్యారు. దీని తరువాత, అతని కుమారుడు మరియు ప్రస్తుతం AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఈ స్థానం నుండి వరుసగా 4 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఒవైసీ 2009లో తొలిసారిగా హైదరాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2009, 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒవైసీ ఎంపీగా ఎన్నికయ్యారు.

ఒవైసీ ఐదోసారి విజయాన్ని నమోదు చేస్తారా?

2024లో కూడా ఒవైసీ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఈసారి కూడా ఫలితం మారకుంటే అది వారికి వరుసగా ఐదో విజయం అవుతుంది. గత రెండు ఎన్నికల్లో భాజపా గట్టిపోటీనిచ్చినా ఓటమిని తగ్గించుకోలేకపోయింది. ఈసారి మాధవి ఆశతో లాంచ్ అయింది. ముఖం కొత్తదే అయినా గుర్తింపు పాతది. మాధవి ప్రముఖ హిందూ నాయకురాలిగా ఉండడంతో పాటు సామాజిక కార్యకర్తగా కూడా గుర్తింపు పొందారు. ఆవుల కొట్టం నడుపుతున్నాడు. మురికివాడల్లోని ముస్లిం మహిళల సుఖదుఃఖాలకు ఆమె అండగా నిలుస్తున్నారు. ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఆమె సనాతన్ యొక్క బలమైన వక్త. ఆరోగ్య రంగంలో కూడా చురుకుగా ఉన్నారు.

నిజంనిప్పులాంటిది

Apr 30 2024, 11:35

తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌.. బాలిక‌ల‌దే పైచేయి…

తెలంగాణలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ ఫ‌లితాలు ఈ రోజు విడుద‌ల‌య్యాయి.

రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య‌ కార్య‌ద‌ర్శి 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాలను కొద్దిసేప టి క్రితమేవిడుద‌ల చేశారు. ఈ ఫ‌లితాల్లో కూడా బాలిక‌ల‌దే పైచేయిగా ఉంది.

టెన్త్ ఫ‌లితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. 3927 స్కూళ్ల‌లో వంద‌ శాతం ఫ‌లితాలు సాధిం చారు. 99శాతం ఫ‌లితాల‌ తో నిర్మ‌ల్ జిల్లా టాప్ ప్లేస్ లో ఉంది...

నిజంనిప్పులాంటిది

Apr 30 2024, 11:32

నేడు తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో భాగంగా ఇవాళ ప్ర‌ధాని మోదీ తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌ను న్నారు. 

బీజేపీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. 

నేటి మధ్యాహ్నం అల్లాదు ర్గ్‌లోని ఐవీ చౌరస్తా వద్ద జరగనున్న జహీరాబా ద్-మెదక్ జనసభలోనూ ముఖ్య అతిథిగా ప్రధాని పాల్గొని ప్రసంగించను న్నారు.

ప్రధాని మోడీ సాయంత్రం హెలికాప్టర్ ద్వారా జహీరా బాద్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి జహీరాబా ద్-మెదక్ జనసభ ప్రాంగణా నికి చేరుకుంటారు. 

అనంత‌రం పబ్లిక్ మీటింగ్‌ లో ప్రసంగిస్తారు. సభ అనంతరం జహీరాబాద్ నుంచి దుండిగల్ విమానా శ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగుపయమవ్వ నున్నారు.

నిజంనిప్పులాంటిది

Apr 30 2024, 11:31

నేడు సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్‌, వరంగల్, చేవెళ్లలలో ఎన్నికల ప్రచారం

లోక్‌సభ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఇవాళ కరీంనగర్‌, వరంగల్, చేవెళ్ల లోకసభ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 

మధ్యాహ్నం హుజూరాబాద్ జనజాతర సభకు సీఎం హాజరవుతారు.అనంతరం సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లి జనజాతర సభలో పాల్గొంటారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. 

అలాగే రాత్రి 7 గంటలకు చేవెళ్ల లోక్‌సభ నియోజ కవర్గం పరిధిలోని మహేశ్వ రం నియోజకవర్గంలో బాలాపూర్, బడంగ్ పేట్ కార్నర్ సమావేశాలల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. 

రాత్రి 9 గంటలకు ఆర్కేపు రం, సరూర్ నగర్ కార్నర్ సమావేశాలల్లో హాజరవు తారని వివరించారు...

నిజంనిప్పులాంటిది

Apr 29 2024, 19:21

లగ్గాలకు ఇక మూడు నెలలు ముహూర్తాలు లేనట్లే

మూఢాలు, ఆషాఢం కారణంగా వచ్చే మూడు మాసాలు ముహూర్తాలు లేవంటున్న వేద పండితులు

పెళ్లిళ్లు సహా ఇతర శుభకార్యాలు నిర్వహించడం కుదరదని వెల్లడి

చిరువ్యాపారుల ఉపాధికి గండి, తగ్గనున్న పెళ్లిళ్ల షాపింగ్స్ సేల్స్

సాధారణంగా ఎండా కాలంలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుం టాయి. కానీ ఈసారి మాత్రం పెళ్లిళ్లు సహా ఇతర శుభ కార్యక్రమాలకు అనూహ్యంగా బ్రేక్ పడనుంది.

వచ్చే మూడు నెలలపాటు శుభ ముహూర్తాలు ఏమీ లేకపోవడమే అందుకు కారణమని వేద పండితులు అంటున్నారు.ఈ నెల 29 నుంచి మూడు నెలలపాటు వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ మాసాల్లో గురు, శుక్ర మౌఢ్యమి వల్ల సుముహూ ర్తాలు ఉండవని వివరిస్తు న్నారు.

దీనివల్ల వివాహాలతోపాటు నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్టాప నలు, శంకుస్థాపనల లాంటి శుభకార్యాలను జరపడం సాధ్యంకాదని తెలియజే స్తున్నారు.

సూర్య కాంతి గురు గ్రహంపై పడినప్పుడు గురు మౌఢ్యమి, శుక్ర గ్రహంపై పడితే శుక్ర మౌఢ్యమి సంక్రమిస్తుందని వేద పండితులు అంటున్నారు. ఫలితంగా ఆయా గ్రహాల గమనం తెలియక శుభ ముహూర్తాలు పెట్టడం కుదరదని పేర్కొంటున్నారు.

వేద పండితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 28 చైత్ర బహుళ చవితి ఆదివారం నుంచి జులై 8 ఆషాఢ శుద్ధ తదియ సోమవారం వరకు శుక్ర పౌఢ్యమి ఉంది.

అలాగే గురు పౌఢ్యమి మే 7 చైత్ర బహుళ చతుర్దశి మంగళవారం నుంచి జూన్‌ 7 జ్యేష్ఠ శుక్ల పాడ్యమి గురువారం వరకు కొనసాగ నుంది.గురు, శుక్ర మూఢా ల్లో నూతన శుభకార్యక్ర మాలు చేయడం మంచిది కాదని పండితులు సూచిస్తు న్నారు.

ఇక జులై 6 నుంచి ఆగస్టు 4 వరకు ఆషాఢ మాసం ఉండటంతో ఎలాగూ పెళ్లిళ్లు సహా ఇతర శుభకార్యాలు నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

మూఢాలు, ఆషాడ మాసం వల్ల శుభకార్యాలకు బ్రేక్ పడటం పూలు, పండ్లు లాంటివి అమ్ముతూ జీవనం సాగించే చిరువ్యాపారుల ఉపాధిపై ప్రభావం చూప నుంది. వారి వ్యాపారం మందగించ నుంది.

అలాగే బాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాలు, డీజే లు, బారాత్ లు నిర్వహించే కళాకారుల ఉపాధికి మూడు నెలలపాటు గండిపడనుంది. నూతన వస్త్రాలు, బంగారు ఆభ రణాల కొనుగోళ్లు మందగిం చనున్నాయి.

నిజంనిప్పులాంటిది

Apr 29 2024, 18:32

మూడు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు..

దేశంలో బాంబు బెదిరిం పులు కలకలం సృష్టిస్తున్నా యి. ఇవాళ దేశంలోని పలు ప్రధాన ఎయిర్‌పోర్ట్స్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆయా విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

సోమవారం ఉదయం రాజ స్థాన్‌లోని జైపూర్, మహారా ష్ట్రలోని నాగ్‌పూర్‌ ‌, గోవా విమానాశ్రయాలకు ఈమె యిల్స్‌ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

దీంతో వెంటనే ఆయా విమా నాశ్రయాల అధికారులు స్థానిక పోలీసులకు సమా చారం అందించారు. రంగం లోకి దిగిన అధికారులు బాంబ్‌ స్క్వాడ్‌, జాగిలాలతో ఆయా విమానాశ్రయాల్లో తనిఖీలు చేపట్టారు.

అయితే, ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపిం చలేదని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు బెదిరింపు మెయిల్స్‌ నేప థ్యంలో ఆయా విమానాశ్ర యాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈమె యిల్‌ పంపిన వారి కోసం గాలిస్తున్నారు. అయితే, ఆయా విమానాశ్రయాల్లో విమాన సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగలేదని అధికారులు తెలిపారు.

కాగా, దేశంలో ఇటీవలే వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా చెన్నై, ముంబైలోని పలు పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు, పలు విమానా శ్రయాలకు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.

ఇలా దేశంలోని పలు పాఠశాలలు, ప్రముఖ సంస్థలకు ఒకదాని తర్వాత ఒకటి వరుస బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది.

నిజంనిప్పులాంటిది

Apr 29 2024, 18:31

సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసు లు నోటీసులు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

మే 1వ తేదీకల్లా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రిజర్వేషన్ల అంశం మీద అమిత్ షాపై కాంగ్రెస్ నేతలే ఫేక్ వీడియోను క్రియేట్ చేశారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.

దీంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నా రని అమిత్ షా చెప్పినట్లు గా ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ పార్టీ వైరల్ చేస్తోం దని ఢిల్లీ, హైదరాబాద్‌తో పాటు పలురాష్ట్రాల్లో బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు.

నిజంనిప్పులాంటిది

Apr 29 2024, 18:29

నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు

లోక్‌సభ ఎన్నికలకు మరి కొన్ని గంటల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. రాష్ట్రం లోని 17 లోక్‌సభ స్థానాలకు 893 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

వారిలో 271 మంది అభ్య ర్థుల నామినేషన్లను అధికా రులు తిరస్కరించారు. మిగిలిన 622 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమెదించారు. ఏప్రిల్ 26న నామినేషన్లను పరిశీలిం చారు.

మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ముగుస్తుంది. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. అత్యధికంగా మల్కాజ్‌గిరి నియోజకవర్గం పరిధిలో 114 నామినేషన్లు దాఖల య్యాయి.

ఆ తర్వాత చేవెళ్లలో 66 మంది, పెద్దపల్లిలో 63 మంది, భువనగిరిలో 61 మంది, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌లలో చెరో 57 మంది, నల్లగొండలో 56, మెదక్‌ 54, కరీంనగర్‌ 53, వరంగల్‌ 58, ఖమ్మం 45, మహబూబ్‌నగర్‌ 42, నిజామాబాద్‌ 42, జహీరాబాద్‌ 40, నాగర్‌ కర్నూల్‌ 34, మహబూ బాబాద్‌ 30, ఆదిలాబాద్‌లో 23 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

ఇక సికింద్రాబాద్‌ కంటోన్మెం ట్‌ ఉపఎన్నికకు 24 మంది అభ్యర్థులు 50 సెట్ల నామి నేషన్లు దాఖలు చేశారు. అందులో 21 మంది నామినేషన్లను అధికారులు ఆమోదించారు.

మే 13న పోలింగ్‌ నిర్వహిం చనున్నారు. జూన్‌ 4న ఓట్లను లెక్కించి ఫలితా లను ప్రకటిస్తారు..